Header Banner

గన్నవరంలో ఘనంగా సీఎం చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు ! శానిటేషన్ కార్మికులకు వస్త్ర దానం!

  Mon Apr 21, 2025 14:57        Politics

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి స్ఫూర్తిదాత విజన్ 2047 ప్రదాత సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక గన్నవరం పి.ఆర్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పారా రామకృష్ణ గన్నవరం గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ కు సుమారు 100మందికి వస్త్ర దానం నిర్వహించారు.

ఈ సందర్భంగా పి.ఆర్.కె ఫౌండేషన్ చైర్మన్ పారా రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి2024 వరకు మన రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరిగాయో మనం చూసాం. గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఎవరనే చెప్పకూడని పరిస్థితుల్లో గడిపాం. నేడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఈ పి.ఆర్.కె ఫౌండేషన్ స్థాపించడానికి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకం. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పి.ఆర్.కె ఫౌండేషన్‌ను స్థాపించాను. నేను పుట్టి పెరిగినటువంటి ఈ నియోజకవర్గానికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. టిడిపి నాయకులు జాస్తి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు.

75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఇవాల్టికి యువకుడు వలే అహర్నిశలు ప్రజల్లో తిరుగుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణను తెచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. అరాచక వైసిపి పార్టీని మట్టుపెట్టి 164 సీట్లతో రాష్ట్రాన్ని అత్యంత మెజారిటీతో గెలిపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు.పి ఆర్ కె ఫౌండేషన్ ద్వారా పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ కు వస్త్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఈ పంచాయతీ మునుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయుకులు ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, జాస్తి శ్రీధర్, కాసరనేని రంగబాబు, టి ఎస్ ఆర్ కే ప్రసాద్, జాస్తి తాతారావు, షేక్ రఫీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..


ఇది కూడా చదవండిరాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuBirthday #GannavaramCelebrations #CMChandrababu #SanitationWorkersSupport #PRKFoundation #ServiceWithRespect